Srinagar, September 19: ఉగ్రవాదం (Terrorisim) కారణంగా జమ్మూకశ్మీర్‌లో (Jammu-Kashmir) దాదాపు మూడు దశాబ్దాల క్రితం (Three Decades Back) మూతబడిన సినిమా థియేటర్లు (Movie Theatres) మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలో ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ పర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో జమ్మూలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
జమ్మూకశ్మీర్‌లో త్వరలో మరిన్ని థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే వారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు స్క్రీన్లు ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో 1980 వరకు సినిమా థియేటర్లు ఉండేవి. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి.