Mysuru Dasara Elephants Clash: రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని ఘోరం.. మైసూర్ ప్యాలెస్ వద్ద గజరాజుల బీభత్సం.. భయంతో జనాలు ఉరుకులు, పరుగులు (వీడియో)
దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు కంజన్, ధనంజయ పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి.
Mysuru, Sep 21: బెంగళూరులోని ప్రసిద్ధ మైసూర్ (Mysuru) ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు (Elephants) కంజన్, ధనంజయ పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో రాజభవనం వెలుపలికి కంజన్ ఒక్కసారిగా పరిగెత్తుకొని రోడ్డు మీదకు వచ్చింది. వెనుక నుంచి కంజన్ ను తరుముతూ రోడ్డునీడకు ధనంజయ కూడా వచ్చింది. ఇలా పరిగెడుతూ.. జయమార్తాండ గేట్ బయట ఉన్న ఎగ్జిబిషన్ రోడ్డులోకి రెండు ఏనుగులు దూసుకొచ్చాయి. ఊహించని పరిణామానికి రోడ్డు మీద ఉన్న ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరుగలేదు.
ట్యాంకర్ ను అమాంతం మింగేసిన రోడ్డు.. పూణేలో షాకింగ్ ఘటన.. వీడియో మీరూ చూడండి!
Here's Video:
ఎప్పుడు జరుగలేదు
మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా రాజమార్గంలో ఆనవాయితీగా జరిగే ఊరేగింపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ఊరేగింపులో అలంకరణతో గజరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అయితే, గత రెండు దశాబ్దాలలో ఊరేగింపులో గానీ, శిక్షణలో గానీ ఏనుగులు పోట్లాడుకునే ఘటనలు ఎప్పుడూ జరుగలేదని అధికారులు చెప్తున్నారు.
వీడియోలు ఇవిగో, చంచలగూడ జైలుకు జానీ మాస్టర్, వీడియోలు తీయకండి అంటూ రిక్వెస్ట్..