UGC Alert: ఎడ్‌టెక్ కంపెనీల ఆన్‌లైన్ పీహెచ్‌డీలకు గుర్తింపు లేదు.. చదివి మోసపోవద్దు.. హెచ్చరించిన యూజీసీ.. విదేశీ విద్యా సంస్థల సహకారంతో దేశంలో గత కొంతకాలంగా ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రాములు అందిస్తున్న ఎడ్‌టెక్ కంపెనీలు..

UGC (Credits: UGC Website)

Newdelhi, October 29: విదేశీ విద్యా సంస్థల (Foreign institutions) సహకారంతో దేశంలోని ఎడ్‌టెక్ కంపెనీలు (EdTech Companies) అందించే ఆన్‌లైన్ (Online) పీహెచ్‌‌డీ ప్రోగ్రాములకు (PhD) ఎలాంటి గుర్తింపు లేదని, కాబట్టి వాటిని చదివి మోసపోవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ-UGC), అఖిల భారత సాంకేతిక విద్యా విభాగం (ఏఐసీటీఈ-AICTE) హెచ్చరికలు జారీ చేశాయి. ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రాములకు సంబంధించి ఎడ్‌కంపెనీలు ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి. వాటి ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రామలను యూజీసీ గుర్తించదని స్పష్టం చేశాయి.

మొన్న పాటలు.. నిన్న డ్యాన్సులు.. మరి ఇప్పుడు..? మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేఏ పాల్ ఊపు.. కొత్త కొత్త వేషధారణతో ఆకట్టుకునే యత్నం.. నెటిజన్లకు ఫుల్ పసంద్.. రైతు వేషంలో సైకిల్ తొక్కుతూ తాజాగా పాల్ ఎన్నికల ప్రచారం... వీడియో ఇదిగో!

పీహెచ్‌డీ అడ్మిషన్ తీసుకోవడానికి ముందు విద్యార్థులు వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవాలని సూచించాయి. పీహెచ్‌డీ డిగ్రీలను ప్రదానం చేసేందుకు విద్యాసంస్థలు యూజీసీ నిబంధనలు, సవరణలను అనుసరించడం తప్పనిసరని స్పష్టం చేశాయి. కాగా, యూజీసీ, ఏఐసీటీఈ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఎడ్‌టెక్ కంపెనీలతో కలిసి దూరవిద్య, ఆన్‌లైన్ మోడ్‌లో కోర్సులు అందించకుండా గుర్తింపు పొందిన వర్సిటీలు, సంస్థలకు ఈ రెండు ఈ ఏడాది మొదట్లో హెచ్చరికలు జారీ చేశాయి.