Vijayawada, Aug 23: ఏపీలోని (AP) ఫార్మా కంపెనీల్లో (Pharma Companies) వరుస ప్రమాదాలు కలకలం సృష్టిస్తోంది. అనకాపల్లిలో (Anakapalle) గురువారం అర్థరాత్రి మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో ఘోరం జరిగింది. రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే విశాఖ నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా బాధితులు జార్ఖండ్ కు చెందినవారిగా సమాచారం.
ఏపీలో మరో భారీ ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్‌లో సినర్జిన్ యాక్టివ్ సంస్థలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.https://t.co/8PYsSQvJCs@ncbn #ap #pharmaindustry #ReactorBlast #latestnews #RTV
— RTV (@RTVnewsnetwork) August 23, 2024
ప్రమాదంపై సీఎం ఆరా
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల ఇదే జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం విదితమే.