IPL Auction 2025 Live

No Doors For Toilets: అక్కడ అంతా ఓపెన్ యవ్వారమే.. తలుపులు, గోడలు లేకుండానే మరుగుదొడ్లు.. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం

గ్రామంలో ఇటీవల నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎందుకంటే, తలుపులు, గోడలు లేకుండానే నాలుగు మరుదొడ్లను ఒకదాని పక్కన ఒకటి నిర్మించారు మరి.

Credits: Twitter

Lucknow, Dec 31: సభ్యసమాజం ముక్కున వేలేసుకునే ఘటన యూపీలోని (Uttarpradesh) బస్తీ (Basti) జిల్లాలోని ధన్సా గ్రామంలో జరిగింది. గ్రామంలో ఇటీవల నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ల (Public Toilets) ఫొటోలు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అయ్యాయి. ఎందుకంటే, తలుపులు (Doors), గోడలు (Walls) లేకుండానే నాలుగు మరుదొడ్లను ఒకదాని పక్కన ఒకటి నిర్మించారు మరి.

ప్రయాణికులకు శుభవార్త. మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్.. ఎక్కడికంటే??

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన ఈ మరుగుదొడ్ల ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్మిస్తారంటూ దుమ్మెత్తి పోశారు. దీంతో స్పందించిన పంచాయతీ రాజ్ అధికారులు వాటిని పగలగొట్టి ధ్వంసం చేసి వివాదానికి అక్కడితో ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ధన్సా గ్రామంలోని రుధౌలి బ్లాక్‌లో నిర్మించిన మరుగుదొడ్ల విషయంలో నిబంధనలు పాటించలేదని అభివృద్ధి విభాగం ముఖ్య అధికారి రాజేశ్ ప్రజాపతి తెలిపారు.

సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో పలు నగరాలకు రాకపోకలు

జిల్లా పంచాయతీ అధికారులు దర్యాప్తు నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టాయిలెట్లు నిర్మించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.