'Aggressive Chicken': ఏటీఎం వద్ద మనుషులపై కోడి దాడి, దర్యాప్తు చర్యలు చేపట్టిన వాల్కర్‌ పోలీసులు, అమెరికాలోని లూసియానాలో ఘటన

ఏటీఎం సెంటర్ కు వెళ్లాలనుకునే వారిపై ఈ కోడి దాడి (terrorizing bank customers) చేస్తుండటంతో స్థానికులు భయపడిపోయి వాల్కర్‌ పోలీసులకు‌ (Walker Police) ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్‌ పోలీసులు శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోం‍ది.

Police are looking for an 'aggressive chicken' terrorizing bank customers in Louisiana (Photo-Walker Police Department)

Louisiana, May 6: బాలయ్య బాబు నటించిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో కోడి ఫైట్ సీన్ తెలిసే ఉంటుంది. ఈ సీన్ ధియేటర్లో నవ్వులు పూయించింది. విలన్ తో నీవు నా చిట్టిమల్లును ఓడిస్తే నన్ను ఓడించినట్లే, అది పారిపోతే నేను పారిపోయినట్లే అన్న డైలాగ్ జనాల చేత ఈలలు వేయించింది కూడా. విలన్ తో బాలయ్య బాబు కోడీ చిట్టిమల్లు వీరోచితంగా పోరాడి అతన్ని ఓడిస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా.. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలోని లూసియానాలో (Louisiana) జరిగింది.  మొబైల్‌ను భార్యగా అనుకుని తాళి కట్టేశాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వర్చువల్ వివాహం, అబ్బాయిది కేరళ, అమ్మాయిది ఉత్తరప్రదేశ్..

అమెరికాలోని లూసియానా లోని ఓ ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై కోడి (Aggressive Chicken) దాడి చేసింది. ఏటీఎం సెంటర్ కు వెళ్లాలనుకునే వారిపై ఈ కోడి దాడి (terrorizing bank customers) చేస్తుండటంతో స్థానికులు భయపడిపోయి వాల్కర్‌ పోలీసులకు‌ (Walker Police) ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్‌ పోలీసులు శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోం‍ది.

మాస్క్‌తో ఉన్న ఈ కోడి ఫొటోను పోస్టు చేస్తూ... ‘‘గత కొద్ది రోజులుగా ఈ కోడి లూసియాన బ్యాంక్‌ ఏటీఎం (Louisiana Bank ATM) వద్దకు వచ్చిపోయే వారిపై దాడి చేస్తూ కలకలం సృష్టిస్తోంది. అంతేగాక రోడ్డుపై సంచరిస్తూ వచ్చిపోయే కార్ల మీదకు ఎగురుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కోడిపై దర్యాప్తు చర్యలు చేపట్టాము. ఇక సదరు కోడి జాడ తెలిసిన వారు వెంటనే మాకు సమాచారం అందించండి’’ అంటూ వాల్కర్ పోలీసులు ఫేస్‌బుక్ పోస్టులో రాసుకు వచ్చారు.

ఇదిలా ఉంటే ఈ పోస్టుకు ఇప్పటి వరకు  వేలల్లో వ్యూస్..‌ కామెంట్లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వాల్కర్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ఆ కోడి రోడ్డు దాటిందేమో అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఢిల్లీలో మందుబాబులపై పూలవర్షం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆర్థిక వ్యవస్థని కాపాడేది మీరేనంటూ పూలు చల్లిన ఢిల్లీ మద్యం ప్రియుడు, వైరల్ అవుతున్న వీడియో

దీనిపై బ్యాంక్‌ అధికారులు మాట్లాడుతూ.. కోడిపై సమాచారం అందించిన క్షణాల్లోనే పోలీసులు స్పందించారని చెప్పారు. అయితే పోలీసులు వచ్చేసరికి ఆ కోడి తప్పించుకుంది. ఇక ఆ కోడి నుంచి సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మళ్లీ అది కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించినట్లు బ్యాంక్‌ అధికారులు పేర్కొన్నారు.ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



సంబంధిత వార్తలు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

Traffic Restrictions In Hyderabad:హైద‌రాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్లో వెళ్లేవారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత