Minister Shekhawat: కరోనా విలయం, బాలాజీకి కొబ్బరికాయ కొట్టండి, ఆయనే అంతా చూసుకుంటాడు, వివాదాస్పదం అవుతున్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఓదార్పు వ్యాఖ్యలు, ట్విట్టర్‌లో వ్యాఖ్యలను సమర్థించుకున్న బీజేపీ సీనియర్ నేత
మృతురాలి బంధువులను ఓదార్చే క్రమంలో షెకావత్.. ‘బాలాజీ మహరాజ్ మంత్రాన్ని జపించి కొబ్బరికాయ కొట్టండి (You offer coconut to Balaji, everything will be alright). అంతా ఆయనే చూసుకుంటారు’ అని షెకావత్ వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడ్డారు.
jaipur, April 27: కరోనావైరస్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు విచిత్ర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవగా తాజాగా వారి సరసన బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Union Minister Gajendra Singh Shekhawat) కూడా చేరారు. కరోనాతో కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధితులకు ధైర్య చెప్పే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
లార్డ్ బాలాజీకి కొబ్బరి కాయ కొట్టండి అంతా ఆయనే చూసుకుంటారని (Pray to Balaji, offer coconut) షెకావత్ చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విజృంభిస్తోందని విమర్శిస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతుంటే ఉచిత సలహాలు ఏంటని ఆయన వ్యాఖ్యలపై చురకలు వేస్తున్నారు.
రాజస్తాన్ జోధ్‌పూర్‌లో కేంద్రమంత్రి షెకావత్ సోమవారం పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధురాదాస్ మాథుర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన్ను ఓ యువకుడు కలుసుకుని తన తల్లిని కాపాడాలని ప్రాధేయపడ్డాడు. యువకుని విజ్ఞప్తి మేరకు షెకావత్ డాక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కేంద్రమంత్రి ఆదేశాలతో బాధితురాలికి చికిత్స చేసేందుకు డాక‍్టర్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ బాధితురాలు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. మృతురాలి కుమారుడు గుండెలవిసేలా రోదించాడు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకున్న తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని కొడుకు రోధించిన తీరు చూపురులను కంటతడి పెట్టించింది.
అయితే, మృతురాలి బంధువులను ఓదార్చే క్రమంలో షెకావత్.. ‘బాలాజీ మహరాజ్ మంత్రాన్ని జపించి కొబ్బరికాయ కొట్టండి (You offer coconut to Balaji, everything will be alright). అంతా ఆయనే చూసుకుంటారు’ అని షెకావత్ వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండా దేవుడిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షెకావత్ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేవుడిపై నమ్మకంతో కొబ్బరికాయ కొట్టమని చెప్పాను అందులో తప్పేముంది. ఆందోళనలో మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలనుకున్నాను. నేను అదే చేశాను’ అని ఆయన పేర్కొన్నారు.
గతేడాది కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మద్దతుగా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఆ సమయంలో కరోనా నివారణ, అవగాహన కోసం కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ‘గో కరోనా గో కరోనా’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఆ స్లోగన్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)