Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్ లో దారుణం.. గర్భిణిపై గ్యాంగ్ రేప్.. నిప్పంటించిన దుండగులు.. బాధితురాలి పరిస్థితి విషమం..
ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Bhopal, Feb 18: మధ్యప్రదేశ్ (Madhya pradesh) లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి (Rape) పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతున్నది. చావు బతుకుల మధ్య పోరాడుతున్నది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్తపై కేసు తప్పించడానికి వెళ్లి..
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి భర్త లైంగిక దాడి నేరంపై జైలు కెళ్లి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. తన భర్తపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళతో రాజీ చేయించటానికి బాధితురాలు యత్నించింది. ఇందులో భాగంగా కేసు పెట్టిన మహిళ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమె ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. మెజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.