Plane Crash: రన్‌ వే పై జారి రెండు ముక్కలైన విశాఖ-ముంబై ప్రైవేటు విమానం.. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం.. విమానంలోని ఎనిమిది మందికి స్వల్ప గాయాలు.. వీడియోతో..

దీంతో విమానం రెండు ముక్కలైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

Credits: X

Mumbai, Sep 15: ముంబై (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయంలో (International Airport) గురువారం ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన ప్రైవేటు జెట్ విమానం (Private Jet Plane) రన్‌ వే (Run Way) పై జారి పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీఎస్ఆర్ వెంచర్స్ లీర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్ విమానం విశాఖపట్నం నుంచి ముంబైకి బయలుదేరింది. ముంబైలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తు రన్‌ వేపై జారి, పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలైంది. విమానంలో ఉన్న ఎనిమిది మందికి స్వల్పగాయలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

PM Modi on Sanatana Dharma: సనాతన ధర్మంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ, ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటుందని మండిపాటు

ఐదు విమానాలను మరోచోట

ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 700 మీటర్లకు మించి విజిబులిటీ లేదని డీజీసీఏ తెలిపింది. విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ రన్‌ వేను కొద్దిసేపు మూసివేశారు. ఆ సమయంలో దిగవలసిన ఐదు విమానాలను మరోచోట దింపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు, రాజకీయ కక్షతో మోడీ నాకు పంపిన నోటీసు అని మండిపడిన కవిత



సంబంధిత వార్తలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Kuwait Airport Chaos: కువైట్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు ఎట్టకేలకు మాంచెస్టర్‌కు, 19 గంటల పాటు తాగేందుకు మంచి నీళ్లులేక పడిగాపులు

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

Airport Food Prices: ఎయిర్‌ పోర్టుల్లో ఫుడ్ కోర్టుల్లో ధరలు చూసి షాక్ అవుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇకపై, సరసమైన ధరలకే లభ్యం కానున్న ఆహార పదార్థాలు, పానీయాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif