Rajasthan Failed Suicide Pact: పెళ్లైన మగవాడితో యువతి ప్రేమాయణం.సమాజం ఒప్పుకోదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం, ప్రియుడు ఆత్మహత్యను చూసి భయంతో ప్రియురాలు ఏం చేసిందంటే..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో నివాసం ఉంటున్న రాజుభట్ (34)కు అప్పటికే పెళ్లయింది.

Representative Image (File Image)

Jaipur, Feb 3: పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం సాగించిన యువతి చివరకు అతడి మరణానికే కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ లోని (Rajasthan) బలోత్రా జిల్లాలో నివాసం ఉంటున్న రాజుభట్ (34)కు అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అదే గ్రామంలోని రవీనాకు (20), రాజుకు మధ్య ఏడాదిగా సంబంధం కొనసాగుతున్నది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని (Marriage) భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో గురువారం ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు కలిసి చనిపోవాలని అనుకున్నారు. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి ఖేడ్ గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు కిందికిదూకి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

Wild Elephant into Village: దారితప్పి జనావాసాల్లోకి అడవి ఏనుగు.. బంధించి తీసుకెళ్లే పనిలో అటవీ అధికారులు.. (వైరల్ వీడియో)

అసలు ట్విస్ట్ ఇది..

అయితే, ప్రియురాలు మాత్రం చివరి నిమిషంలో భయపడి మనసు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది. రాజు ఆత్మహత్యకు రవీనానే కారణమని, ఆమే అతడిని హత్య చేసిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆమెను అరెస్ట్ చేసేంత వరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Cancer Cases in India: క్యాన్సర్‌ భారతం.. దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికిపైగా మృత్యువాత.. మరో 14.1 లక్షల కేసుల కేసులు