Reliance Jio Tariff Hike: రెండున్నరేండ్ల తర్వాత 20 శాతం చార్జీలు పెంచేసిన జియో, కొత్తగా 19 రకాల టారిఫ్ ప్లాన్లు ప్రకటన, పూర్తి వివరాలు ఇవిగో..
వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు కాగా, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. ఇక రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచింది. పెరిగిన ఈ కొత్త టారిఫ్ ప్లాన్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాన్ మీద 22 శాతం చార్జీలు పెంచేసింది.
రిలయన్స్ జియో కొత్తగా 19 రకాల అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. వాటిలో 17 ప్రీపెయిడ్ ప్లాన్లు కాగా, రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. ఇక రెండున్నరేండ్ల తర్వాత రిలయన్స్ జియో టారిఫ్ ధరలు పెంచింది. పెరిగిన ఈ కొత్త టారిఫ్ ప్లాన్లు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాన్ మీద 22 శాతం చార్జీలు పెంచేసింది. ఇప్పటి వరకూ రూ.155లతో ఉన్న బేస్ ప్లాన్ కోసం రూ.189 పే చేయాలి. కొత్త టారిఫ్ ప్లాన్లలో నెలకు రూ.189లతో కూడిన ప్లాన్ పై 2జీబీ డేటా, రోజువారీగా 2.5 జీబీ డేటా కోసం రూ.3,599తో వార్షిక టారిఫ్ ప్రకటించింది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీ-పెయిడ్ ప్లాన్లపై సరాసరి 20 శాతం ధరలు పెంచేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల డేటా లీక్, 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టిన హ్యాకర్, కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి
28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ రూ.155 నుంచి రూ.189కి పెంచేసింది. రూ.209 తో కూడిన ప్లాన్ రూ.249లకు పెరిగింది. అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందాలంటే రూ.239 నుంచి రూ.299 చెల్లించాల్సిందే. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గడువు కేవలం 28 రోజులు. వీటితోపాటు కొత్తగా ప్రారంభించిన జియో సేఫ్, జియో ట్రాన్స్ లేట్. క్వాంటం సెక్యూర్ కమ్యూనికేసన్ ఆప్ పర్ కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్ తదితర సర్వీసుల కోసం రూ.199 చెల్లించాలి. జియో ట్రాన్స్ లేట్ అంటే బహుళ భాషా కమ్యూనికేషన్ యాప్. వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్ ట్రాన్స్ లేషన్ కోసం నెలకు రూ.99 పే చేయాల్సి ఉంటుంది.
టారిఫ్ పెంపు తర్వాత ప్లాన్లు ఇలా
28 రోజులు – రూ.189 – 2జీబీ
28 రోజులు – రూ.249 – 1జీబీ
28 రోజులు – రూ.299 – 1.5 జీబీ
28 రోజులు – రూ.349 – 2 జీబీ
28 రోజులు – రూ.399 -2.5జీబీ
28 రోజులు – రూ.449 – 3 జీబీ
56 రోజులు – రూ.579 – 1.5 జీబీ
56 రోజులు – రూ.629 – 2 జీబీ
84 రోజులు – రూ.479 – 6జీబీ
84 రోజులు -రూ.799 – 1.5 జీబీ
84 రోజులు – రూ.859 – 2 జీబీ
84 రోజులు -రూ.1199 -3జీబీ
336 రోజులు – రూ.1899- 24 జీబీ
365 రోజులు – రూ.3599 – 2.5 జీబీ
డేటా యాడ్ ఆన్ ప్లాన్లు
బేస్ ప్లాన్ – రూ.19 – 1 జీబీ
బేస్ ప్లాన్ – రూ.29 – 2 జీబీ
బేస్ ప్లాన్ – రూ.69 – 6జీబీ