'Crorepati' Tax Justice Plan: కోట్లకు పడగలెత్తిన వారిపై ‘కరోడ్‌ పతి ట్యాక్స్‌’ విధించాలి.. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులుంటే 2%.. రూ. 100 కోట్లు దాటితే 4 శాతం పన్ను.. ఈ ట్యాక్స్ ఎందుకు విధించాలంటే?

వీటిని తగ్గించడానికి ఫ్రాన్స్‌ కు చెందిన వరల్డ్‌ ఇనిక్వాలిటీ ల్యాబ్‌ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు.

Currency (Credits: X)

Newdelhi, May 25: దేశంలో ఆర్థిక అసమానతలను (Financial Inequality) అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిని తగ్గించడానికి ఫ్రాన్స్‌ కు (France) చెందిన వరల్డ్‌ ఇనిక్వాలిటీ ల్యాబ్‌ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు. దేశంలోని సంపన్నులపై ‘కరోడ్‌ పతి ట్యాక్స్‌’ విధించాలని సిఫారసు చేశారు. 2010 తర్వాత ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తిన కరోడ్‌పతిలు సంపాదించిన సొత్తుపై ముఖ్యంగా ఈ పన్ను విధించాలని పేర్కొన్నారు.

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ

ట్యాక్స్ విధింపు ఇలా..

‘కరోడ్‌ పతి ట్యాక్స్‌’ను సంపాదనను బట్టి విధించాలని నిపుణులు సూచించారు. రూ. 10 కోట్ల వరకూ సంపాదన ఉన్నవారికి 2%, రూ. 100 కోట్ల సంపాదన ఉన్నవారికి 4 శాతం, రూ. 100 కోట్లకు పైగా సంపాదన ఉన్నవారికి మరింత ఎక్కువగా ట్యాక్స్‌ ఉండాలని ఓ పట్టికను విడుదల చేశారు. ఈ కొత్త ట్యాక్స్‌ నిబంధనల ప్రభావం దేశంలో సంపన్నులుగా ఉన్న 0.04 శాతం మందిపై మాత్రమే ఉంటుందని, మిగతా 99.96 శాతం మంది జనాభాపై ఏ ప్రభావం ఉండబోదని వెల్లడించారు.

క్రిప్టో ఐకాన్‌, మన సోషల్ మీడియా చింటూ డాగ్ కబొసు ఇక లేదు.. మరణించిన జపనీస్‌ శునకం