Asia Cup 2022: భారత్-పాక్ మధ్య పోరులో ఎవరు గెలుస్తారో అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్‌.. ఇంతకీ ఎవరు విజయం సాధించనున్నారంటే?

ఆ టీం గెలువడానికి కారణాలు కూడా వివరించాడు. మరి గెలిచే టీం ఏంటంటే?

Ricky Ponting (Photo Credits: Twitter)

New Delhi, August 13: చిరకాల ప్రత్యర్థులైన భారత్‌ (India), పాకిస్తాన్‌ (Pakistan) మ్యాచ్‌ అంటే యావత్తు ప్రపంచం ఎంతో క్రేజ్‌తో చూస్తుంది. ఆసియాకప్‌ (Asia Cup)లో భాగంగా ఆగస్టు 28న దుబాయ్‌ (Dubai) వేదికగా ఇరుజట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఎవరు గెలిస్తారన్న దానిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్‌లో భారత్‌- పాకిస్తాన్‌లో ఎవరు విజేతగా నిలువనున్నారో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ (Ricky ponting) జోస్యం చెప్పాడు. ఆయన మాటల్లోనే.. 'ఇంకో 15-20 ఏళ్లయినా సరే.. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌కున్న క్రేజ్‌ పోవడం కష్టం. క్రికెట్‌ చరిత్రలో ఈ ఇరుజట్లు ఎప్పటికి చిరకాల ప్రత్యర్థులుగానే అభిమానులు చూస్తారు.

దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్.. ఎందుకంటే?

ఇక ఆసియాకప్‌లో ఈ రెండు జట్లలో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్‌ లాంటి మేజర్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై భారత్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉంటే.. ఆసియా కప్‌లో మాత్రం ఇరుజట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా కప్‌లో 13 సార్లు తలపడితే.. భారత్‌ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్‌ ఐదు గెలవగా.. ఒక మ్యాచ్‌ ఫలితం రాలేదు. కానీ నా ఓటు టీమిండియాకే (TeamInida)  వేస్తున్నా. ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్‌లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్‌ మంచి ఆటను కనబరుస్తున్నప్పటికి ఒత్తిడిలో చిత్తవుతుందేమో అనిపిస్తుంది’ అని పేర్కొన్నాడు. పాంటింగ్ వ్యాఖ్యలతో భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుస్తున్నారు.