 
                                                                 New Delhi, August 12: ఆసియా కప్ (Asia Cup 2022) కోసం ఆగస్టు 20న భారత ఆటగాళ్లు దుబాయ్ (Dubai)కి బయలుదేరనున్నారు. అయితే, జట్టులో భాగమైన దీపక్ హుడా (Deepak Hooda), అవేష్ ఖాన్ (Avesh Khan) మాత్రం రెండు రోజులు ఆలస్యంగా (Two days Delay) దుబాయ్ కు బయల్దేరుతారని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. దీనికి గల కారణాన్ని కూడా వివరించింది. జింబాబ్వే వన్డే, ఆసియా కప్ రెండు జట్లులోను భాగమైన దీపక్ హుడా, అవేష్ ఖాన్ ఆగస్టు 22న సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడ నుంచి దుబాయ్‌కు చేరుకుంటారని తెలిపింది. ఆసియాకప్-2022 యూఏఈ(UAE) వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్(Pakisthan)తో ఆగస్టు 28 తలపడనుంది.
18న టీమిండియా ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ పరీక్షలు.. దుబాయ్ కి మన సేన ఎప్పుడు వెళ్లనున్నారంటే?
ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
