Asia Cup 2022: 18న టీమిండియా ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ పరీక్షలు.. దుబాయ్ కి మన సేన ఎప్పుడు వెళ్లనున్నదంటే?

ఆసియా కప్ కు హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ళకు 18న బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలు

Asia Cup 2022: 18న టీమిండియా ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ పరీక్షలు.. దుబాయ్ కి మన సేన ఎప్పుడు వెళ్లనున్నదంటే?
Team India (Image Credits: Twitter)

New Delhi, August 12: క్రికెట్ అభిమానులు (Cricket fans) ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2022 (Asia Cup 2022) సందడి మొదలైంది. ఈ సిరీస్ లో పాల్గొనడం కోసం యూఏఈకు (UAE) వెళ్లే ముందు భారత ఆటగాళ్లు (Team India Players) ఫిట్‌నెస్ పరీక్షలకు (Fitness Tests) హాజరు కానున్నారు. వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇద్దరు పాకిస్తాన్ బాక్సర్లు మిస్సింగ్, కామన్‌వెల్త్ గేమ్స్‌ నుంచి తిరుగుమవుతుండగా ఘటన, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉందనగా కలకలం, రెండు నెలల క్రితం కూడా ఓ పాకిస్తాన్ స్విమ్మర్ గల్లంతు, ఇప్పటికీ దొరకని ఆచూకీ

అనంతరం రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 18న బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో సమావేశం కానుంది. అక్కడ వారికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించునున్నారు. ఆగస్టు 20న భారత ఆటగాళ్లు దుబాయ్‌ (Dubai)కి బయలుదేరనున్నట్టు సమాచారం.

(The above story first appeared on LatestLY on Aug 12, 2022 12:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).