Birmingham, AUG 10: కామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) అయిపోయాయి. అన్ని దేశాల జట్లు తిరుగు పయనమయ్యాయి. అయితే ఇంతలోనే బర్మింగ్‌హమ్‌లో (Birmingham) పిడుగులాంటి వార్త కలకలం రేపింది. తిరుగుపయనమైన పాకిస్తాన్ (Pakistan) టీం నుంచి ఇద్దరు బాక్సర్లు (Two Pakistani Boxers Go Missing) మిస్సయ్యారు. వారిద్దరి జాడ తెలియరాలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన జట్టులో బాక్సర్లు నజీర్ ఉల్లా (Nazeer Ullah), సులేమాన్ బలోచ్‌లు (Suleman Baloch) మిస్సయినట్లు పాకిస్తాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (Pakistan Boxing Federation) ధృవీకరించింది. వారిద్దరికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు మేనేజ్‌మెంట్ దగ్గరే ఉన్నాయని వారు తెలిపారు. దీంతో మిస్సయిన బాక్సర్లకు సంబంధించి పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ (Pakistan Olympic association) అధికారులు కామన్‌వెల్త్ గేమ్స్ అథారిటీని సంప్రదించింది. వారిని వెతికిపెట్టడంతో సాయం చేయాలని కోరింది. దీనిపై యూకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాక్సర్ల మిస్సింగ్ కు సంబంధించి పాకిస్తాన్ కు చెందిన డాన్ పత్రిక కథనం వెలువరించింది. వారిద్దరు చివరిసారిగా ఎవరితో మాట్లాడారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇస్లామాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు కేవలం రెండు గంటల ముందుగానే ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
రెండు నెలల క్రితం హంగేరీలో ఫినా వరల్డ్ ఛాంపియన్ షిప్ సందర్భంగా కూడా పాకిస్తాన్ కు చెందిన స్విమ్మర్ ఫైజాన్ అక్బర్ మిస్సయ్యాడు. పోటీల్లో పాల్గొనకముందే అతను మిస్సయినట్లు అధికారులు తెలిపారు. జూన్ నుంచి అక్బర్ ఆచూకీ దొరకలేదు. ఇంతలోనే ఇద్దరు బాక్సర్లు కూడా గల్లంతవ్వడం కలకలం రేపుతోంది.