RPS Viral Video: మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ రాసలీలలు, వైరల్ అవుతున్న హీరాలాల్ సైనీ, మహిళా కానిస్టేబుల్ స్విమ్మింగ్ పూల్ వీడియో, చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు
సదరు మహిళా కానిస్టేబుల్, డీఎస్పీలు స్విమ్మింగ్‌పూల్‌లో అభ్యంతరకర స్థితిలో ( Video Showing Him Engaging in Sexual Gestures ) ఆ వీడియోలో కనిపిస్తున్నారు. వీరితో పాటు ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం విశేషం.
Jaipur, Sep 11: రాజస్థాన్ పోలీస్ సర్వీస్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)లకు సంబంధించిన అభ్యంతరకర వీడియో (RPS Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళా కానిస్టేబుల్, డీఎస్పీలు స్విమ్మింగ్‌పూల్‌లో అభ్యంతరకర స్థితిలో ( Video Showing Him Engaging in Sexual Gestures ) ఆ వీడియోలో కనిపిస్తున్నారు. వీరితో పాటు ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం విశేషం.
ఆ చిన్నారి సమక్షంలోనే వీరిద్దరూ సరససల్లాపాల్లో మునిగితేలడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు వీరిపై చర్యలకు ఉపక్రమించారు. వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఆ మహిళా కానిస్టేబుల్ జైపూర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సదరు డీఎస్పీ అజ్మేర్ జిల్లాలో పనిచేస్తున్నారు . మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అందిన సమాచారం ప్రకారం, మహిళా కానిస్టేబుల్ జైపూర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తుండగా, ఆర్‌పిఎస్ అధికారి హరిలాల్ సైనీ (RPS Officer Hiralal Saini) అజ్మీర్ జిల్లాలోని బేవార్‌లో సిఓగా విధులు నిర్వహిస్తున్నారు. RPS అధికారి హీరాలాల్ సైనీ మత్తులో ఉన్నట్లు వైరల్ వీడియోలో తేలింది. కాబట్టి మహిళా కానిస్టేబుల్ RPS ఆఫీసర్‌తో లైంగిక సంబంధం కలిగి ఉంది. మహిళా కానిస్టేబుల్ కూడా కెమెరా వైపు చూస్తున్నారు. ఇంతలో, ఆర్‌పిఎస్ అధికారి మరియు సంబంధిత మహిళా కానిస్టేబుల్ వీడియో నకిలీదని మరియు సవరించబడ్డారని చెప్పారు. వీడియోలో కనిపించిన మహిళ కూడా తనకు తెలియదని పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
రాజస్థాన్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ).. సదరు డీఎస్పీని అరెస్ట్ చేసింది.. పోలీసు అధికారి సైనీని గురువారం రాత్రి ఉదయ్‌పూర్‌లోని ఒక రిసార్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.. వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో పోలీసులు సైనీని అరెస్ట్ చేశామన్నారు.. సైబర్ క్రైమ్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైందని.. మహిళా కానిస్టేబుల్ తన బిడ్డతో ఉన్నందున ఆమెను అరెస్టు చేయలేదు. తర్వాత అదుపులోకి తీసుకోనున్నట్టు ఎస్‌వోజీ అధికారులు చెబుతున్నారు.
వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ అరెస్ట్‌ను ఏడీజీ అశోక్ రాథోడ్ ధ్రువీకరించారు. రాజస్థాన్ పోలీస్ చీఫ్ డీజీ మోహన్‌లాల్ లాథర్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.