Mumbai Shocker: మహిళ ప్రైవేట్ భాగాల్లో రాడ్ పెట్టి హింసిస్తూ... దారుణంగా అత్యాచారం, ముంబైలో నిర్భయ తరహా ఘటన, చావు బతుకుల్లో బాధితురాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఘోరమైన ఘటన (Mumbai Shocker) చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళపై కామాంధులు అత్యంత కిరాతకంగా లైంగిక దాడి జరిపారు.

Mumbai Shocker: మహిళ ప్రైవేట్ భాగాల్లో రాడ్ పెట్టి హింసిస్తూ... దారుణంగా అత్యాచారం, ముంబైలో నిర్భయ తరహా ఘటన, చావు బతుకుల్లో బాధితురాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Representational Image (Photo Credits: File Image)

Mumbai, September 10: దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో ఘోరమైన ఘటన (Mumbai Shocker) చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళపై కామాంధులు అత్యంత కిరాతకంగా లైంగిక దాడి జరిపారు. మహిళపై అత్యాచారం (30-Year-Old Woman Raped) చేసిన అనంతరం ఆ నరరూప రాక్షసులు బాధితురాలి రహస్య అవయవాలపై రాడ్డుతో దాడి (Brutalised Like ‘Nirbhaya’ in Sakinaka) చేసి నడి రోడ్డుపైనే రక్తపు మడుగులో వదిలి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది.

ఈ పాశవిక ఘటనపై ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని సాకినాక ప్రాంతంలోని ఖైరానీ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో రహదారిపై ఓ మహిళ రక్తపు మడుగులో స్పృహ కోల్పోయి ఉన్నట్టు తమ ప్రధాన కాల్‌ సెంటర్‌కు సమాచారం వచ్చినట్టు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకొని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే డీసీపీ, అడిషనల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై తెగబడిన కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేసి హత్య, నిందితుడు ఇంట్లో చిన్నారి మృతదేహం, నిందితుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్‌

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ పాశవిక ఘటనలో మరికొంత మంది ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఏ రోజు జరిగిందనే విషయం మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. మరోవైపు, ఆ ప్రాంత డీసీపీతో పాటు ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

(The above story first appeared on LatestLY on Sep 11, 2021 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).