Rupee Biryani Offer: రూపాయ్ నోటుకు బిర్యానీ ఆఫర్.. ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు.. బయటకు వచ్చి చూస్తే జరిమానా.. అసలేంటి విషయం..
రూపాయ్ నోటుకు బిర్యానీ అంటూ ప్రకటించారు.
Karimnagar, June 17: తెలంగాణలోని (Telangana) కరీంనగర్‌లో (Karimnagar) ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ (Opening) సందర్భంగా దాని ఓనర్ బిర్యానీకి (Biryani) సంబంధించి ఓ బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించారు. రూపాయ్ నోటుకు (Rupee Note) బిర్యానీ అంటూ ప్రకటించారు. ఈ ఆఫర్‌ను చూసిన కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకేముంది.. ఎక్కడెక్కడో దాచుకున్న రూపాయి నోటుకు దుమ్ముదులిపారు కరీంనగర్ పట్టణ ప్రజలు. రూపాయ్ నోటును చేతబట్టుకుని కొత్త రెస్టారెంట్ దగ్గర వాలిపోయారు. మధ్యాహ్న సమయానికంటే ముందే బిర్యానీ ప్రియులు రూపాయ్ నోటుతో ఆ రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. చవకగా బిర్యానీ వస్తుండడంతో… ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు తీరారు.
పోలీసుల షాక్
ఎండను కూడా లెక్కచేయకుండా జనం ఎగబడడంతో రెస్టారెంట్ యాజమాన్యం షట్టర్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. దాంతో.. బిర్యానీ ప్రియులు.. కొద్దిసేపు ఎండలో పడిగాపులు కాశారు. మధ్యలో కాస్త తోపులాట కూడా జరిగింది. దీంతో డోర్స్ క్లోజ్ చేసిన రెస్టారెంట్ సిబ్బంది.. రూపాయి నోటు తెచ్చుకున్నవారికి.. కౌంటర్ ఏర్పాటు చేసి పార్శిల్ రూపంలో బిర్యానీ అందజేశారు. మొత్తంగా.. రూపాయ్ నోటుకు బిర్యానీ దక్కించుకున్న వారు నోరూరించుకుంటూ ఇంటికి వెళ్దామనుకునే సమయంలో వారికి మరో షాక్ తగిలింది. షాప్ ముందు రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేసిన వారికి పోలీసులు 200 ఫైన్ చేశారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే రూ. 200 జేబుకు చిల్లులు పడిందని నిరాశపడుతున్నారు.