Verdict on Bribery: రూ.100 లంచం చాలా చిన్న విషయమంటూ నిందితుడికి విముక్తి కల్పించిన హైకోర్టు.. ఏంటా సంగతి??

వంద రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌ గా దొరికిన ఓ ప్రభుత్వ వైద్యుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Representational Image (Photo Credit: ANI/File)

Pune, Oct 6: వంద రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌ (Red Handed) గా దొరికిన ఓ ప్రభుత్వ వైద్యుడిని (Govt. Doctor) హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2007లో రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ.. ఆసియా గేమ్స్ ఫైన‌ల్లోకి భార‌త్‌

అసలేం జరిగిందంటే??

పూణెలోని పౌడ్ గ్రామీణ ఆసుపత్రిలో అనిల్ షిండే అనే వైద్యుడు ఉన్నారు. 2007లో స్థానికంగా ఉండే ఓ వ్యక్తిపై దాడి జరిగింది. అతడికి గాయాలయ్యాయి. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని అతడు షిండేను ఆశ్రయించాడు. ఈ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అతడిని రూ.100 డిమాండ్ చేసిన అనిల్ షిండే  డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. ఈ కేసులో స్పెషల్ కోర్టు షిండేను నిర్దోషిగా ప్రకటిస్తూ 2012లో తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టు తాజాగా సమర్థించింది.

ICC World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్, 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ అదిరిపోయే విక్టరీ, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్రతీకారం



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif