Fine For Littering, Spitting: రైల్వే ఆవరణలో చెత్త, ఉమ్మివేయడంపై భారీ జరిమానా... రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం

రైల్వే ప్రాంగణంలో ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది.

Train (Credits: Wikimedia commons)

Newdelhi, July 27: రైల్వే ప్రాంగణంలో (Railway Stations) ఉమ్మివేయడం, చెత్తవేయడం నిషేధించడమైనదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. చెత్తను వేసే వ్యక్తులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలలో చెత్తవేసినందుకు, ఉమ్మివేసినందుకు గాను దాదాపు 3,30,132 మందికి జరిమానా విధించినట్లు, ఈ జరిమానా ద్వారా 5.13 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. గత రెండేళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు, ఉల్లంఘించిన వారిపై వేసిన ఫైన్ లకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో వేసిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

జరిమానా పెంచే యోచన లేదు

ఉమ్మివేయడం, చెత్తవేయడానికి సంబంధించిన జరిమానాల మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది.

అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement