IPL Auction 2025 Live

Pink Sky Viral Photos: గులాబి రంగులోకి మారిపోయిన ఆకాశం, గ్రహాంతర వాసుల పనేనంటున్న నెటిజన్లు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ఆస్ట్రేలియాలోని మిల్దురాలో గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది.

Pink Sky Viral Photos

ఆస్ట్రేలియాలోని మిల్దురాలో గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో భూమిపైన ఉన్న దాని నుంచే ఆ కాంతి వెలువడుతోందని, దాని ద్వారానే ఆకాశం గులాబీ రంగులోకి మారిపోయిందని పలువులు విశ్లేషించారు. ఆకాశంలో ఏర్పడిన గులాబీ రంగుకు కారణం ఆ ప్రాంతంలో ఓ ఫార్మాసిటికల్‌ సంస్థ సాగు చేస్తున్న గంజాయి మొక్కలేనని తేల్చారు.

మా సంస్థలో కొత్త సాగు ప్రాంతం కోసం ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఆకాశంలోకి కాంతి ప్రసరణ జరగటం స్థానికులు గమనించారు. అది సోలార్ ఫ్లేర్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ కాదని మేము నమ్మకంగా చెప్పగలం.’ అని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది ఫార్మా సంస్థ.

Here's Photos

గంజాయి మొక్కలు ఎదిగేందుకు వివిధ రకాల కాంతి అవసరమవుతుందని, పూలు పూసే సమయంలో ఎర్ర లైట్‌ ఉపయోగించాలని తెలిపారు ఫార్మా సంస్థ సీఈవో పీటర్‌ క్రాక్. కొత్త సాంకేతికతను ఈ ఏడాదే తీసుకొచ్చామని, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

షాకింగ్ వీడియో.. వేగంగా వెళుతున్న చెత్త వాహనంపై శక్తిమాన్‌ తరహాలో విన్యాసాలు, ఒక్కసారిగా కిందపడటంతో తీవ్ర గాయాలు, శక్తిమాన్‌గా వ్యవహరించొద్దని వార్నింగ్ ఇచ్చిన యూపీ పోలీసులు

ఆకాశంలో అద్భుత దృశ్యం ఏర్పడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కొందరు దానిని అద్భుతం అంటూ వర్ణించగా.. కొందరు గ్రహాంతర వాసుల పనేనంటూ భయాందోళనలకు గురయ్యారు.