ఒక వాహనంపై ప్రమాదకరంగా స్టంట్లు చేసి గాయపడిన యువకుడి వీడియోను సోషల్ మీడియాలో యూపీ పోలీసులు పోస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీస్ అధికారిణి శ్వేతా శ్రీవాస్తవ ట్విట్టర్‌లో ఆదివారం ఈ వీడియో షేర్ చేస్తూ.. శక్తిమాన్‌గా వ్యవహరించొద్దని సూచించారు. షేర్ చేసిన వీడియోలో.. ఒక యువకుడు చెత్త వాహనంపై శక్తిమాన్ తరహాలో విన్యాసాలు చేశాడు. కదులుతున్న గార్బేజ్ వాహనంపై పుష్‌అప్‌లు తీశాడు. అనంతరం దానిపై ఠీవిగా నిల్చొని బిల్డప్ ఇచ్చాడు. అయితే వాహనం మలుపు తిరుగడంతో అదుపు తప్పి దాని పైనుంచి రోడ్డుపై పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడి ఫొటోలు కూడా ఆ వీడియోలో ఉంచారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
गोमतीनगर, लखनऊ का कल रात का दृश्य-
बन रहे थे शक्तिमान, कुछ दिनों तक नहीं हो पाएंगे विराजमान!
चेतावनी: कृपया ऐसे जानलेवा स्टन्ट न करें! pic.twitter.com/vuc2961ClQ
— Shweta Srivastava (@CopShweta) July 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)