Snake In Air India Flight: ఎయిరిండియా విమానంలో పాము.. కార్గో క్యాబిన్ చెక్ చేస్తుండగా కనిపించిన పాము.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎయిరిండియా

కోల్‌కతా నుంచి బయలుదేరిన బి 737-800 విమానం దుబాయ్ చేరుకుంది. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమాన సిబ్బంది కార్గో క్యాబిన్‌ను చెక్ చేస్తున్న సమయంలో అందులో పాము కనిపించింది.

File (Credits: Twitter)

Dubai, Dec 11: టాటా గ్రూప్ నకు (TATA Group) చెందిన ఎయిరిండియా (Air India) విమానంలో (Flight) పాము (Snake) కలకలం రేపింది. కోల్‌కతా (Kolkata) నుంచి బయలుదేరిన బి 737-800 విమానం దుబాయ్ (Dubai) చేరుకుంది. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత విమాన సిబ్బంది కార్గో క్యాబిన్‌ (Cargo Cabin)ను చెక్ చేస్తున్న సమయంలో అందులో పాము కనిపించింది.

‘భవదీయుడు భగత్‌సింగ్’ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’గా మారిందోచ్.. పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ మారిన సినిమా టైటిల్ ఇది..

దీంతో అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ప్రయాణం సమయంలో పాము విషయం తెలిస్తే పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పాము కలకలం విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ధారించింది. మరోవైపు, క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిరిండియా తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.