Hyderabad, Dec 11: పవన్ కళ్యాణ్ కెరీర్ లో (Pawan Kalyan) వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) ను డైరెక్ట్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్ సింగ్’ (Bhavadheeyudu Bhagat Singh) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారింది. సినిమా టైటిల్‌ను ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా (Ustaad Bhagat Singh) మారుస్తున్నట్టు ప్రకటిస్తూ టైటిల్, పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌లైన్ కూడా తగిలించింది. త్వరలోనే సినిమా చిత్రీకరణ మొదలవుతుందని పేర్కొంది.
ఫోన్ లో గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా పేలిన మొబైల్.. 13 ఏండ్ల బాలుడికి తీవ్ర గాయాలు.. మథురలో ఘటన
ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సీనియర్ దర్శకుడు దశరథ్ స్క్రిప్ట్ వర్క్ లో పనిచేస్తున్నారు.