Real Estate in Heaven: ఇదేందయ్యా.. ఇది..?? ఏకంగా స్వర్గంలో ప్లాట్ల అమ్మకం .. ఎంచక్కా దేవుడి పక్కనే ఉండొచ్చంటూ స్పెయిన్ చర్చ్ ప్రచారం.. చదరపు మీటర్ రేటెంతంటే?

దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్ లైన్ లో ప్రకటనలు గుప్పించాడు.

Cloud (Photo Credits: Twitter)

Newdelhi, June 24: భూమిపైనే (Earth) కాదు చంద్రుడిపై (Moon) కూడా రియల్ ఎస్టేట్ (Real Estate in Heaven) ఇటీవల జోరుగా జరిగింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ స్పెయిన్ కు చెందిన ఓ చర్చి ఫాస్టర్ ఏకంగా స్వర్గంలోనే భూములు అమ్ముతానంటూ ఆన్ లైన్ లో ప్రకటనలు గుప్పించాడు. చదరపు మీటర్ కు కేవలం వంద డాలర్లేనని చెబుతూ.. స్వర్గంలోని స్పెషల్ ఏరియాలో ఒక్క ప్లాట్ కొనుక్కుంటే సాక్షాత్తూ దేవుడి పక్కనే ఉండొచ్చని అంటున్నాడు. కొనుగోలు కోసం అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు గూగుల్ పే, యాపిల్ పే వంటి యూపీఐ పేమెంట్ సదుపాయం కూడా ఉందని చెప్పాడు. దీంతో ఈ ప్రకటనల విషయమై పెద్ద చర్చ మొదలైంది.

తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు.. కొత్త నిబంధనలపై వ్యాపారుల అసహనం

దేవుడి అనుమతి ఉందట..

తాను అమ్మే విక్రయాలకు దేవుడి అనుమతి కూడా ఉందని ఫాస్టర్ ప్రచారం చేయడం విశేషం. ఇది నమ్మిన వందలాది మంది బుకింగ్స్ చేసుకొంటున్నారు. దీంతో ఇప్పటికే, సదరు ఫాస్టర్ స్వర్గంలో భూముల అమ్మకం ద్వారా లక్షలాది డాలర్లు ఆర్జించాడని స్థానిక మీడియా తెలిపింది.

ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు