Taxi Driver Falls Asleep: కారు నడుపుతూ నిద్రపోయిన క్యాబ్ డ్రైవర్, అతడి డ్రైవింగ్‌కి దండం పెట్టి స్వయంగా డ్రైవింగ్ చేసుకున్న మహిళా ప్యాసెంజర్

అతడి డ్రైవింగ్ కు భయపడిన ఆ మహిళ, ఆ డ్రైవర్ ను పక్కన కూర్చోబెట్టుకొని తనకు తానుగా డ్రైవింగ్ చేసుకొని గమ్యస్థానం చేరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....

Representation Image | (Image Credits: PTI)

Mumbai, March 5: క్యాబ్ బుక్ చేసుకొని సుఖమయ ప్రయాణం చేద్దామనుకున్న ఓ మహిళకు చుక్కలు చూపించాడు ఓ క్యాబ్ డ్రైవర్ (Taxi Driver) . అతడి డ్రైవింగ్ (Negligence Driving) కు భయపడిన ఆ మహిళ, ఆ డ్రైవర్ ను పక్కన కూర్చోబెట్టుకొని తనకు తానుగా డ్రైవింగ్ చేసుకొని గమ్యస్థానం చేరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన తేజస్విని దివ్య నాయక్ అనే 28 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 21న పుణె నుంచి ముంబై (Pune- Mumbai) వెళ్లడానికి మధ్యాహ్నం 1 గంటకు  క్యాబ్ బుక్ చేసుకుంది. ఇక ఆమె క్యాబ్ ఎక్కి ప్రయాణం మొదలైన దగ్గర్నించీ ఆ క్యాబ్ డ్రైవర్ అదేపనిగా ఫోన్లో మాట్లాడుతూ అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడట. విసుగు చెందిన తేజస్విని, ఆ డ్రైవర్ ను ఫోన్ పక్కన పెట్టి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టుమని కోరిందట. దీంతో ఆ డ్రైవర్ తన ఫోన్ అయితే పక్కన పెట్టాడు కానీ, ఆ వెంటనే ఒక వైపు డ్రైవింగ్ చేస్తూనే మరోవైపు కునుకు తీయడం ప్రారంభించాడు, ఇదే క్రమంలో ఎదురుగా వచ్చే మరో వాహనాన్ని ఢీకొట్టబోయాడట.

ఇక లాభం లేదనుకున్న తేజస్విని, కారు ఆపి డ్రైవర్ ను పక్కసీట్లోకి రామ్మని చెప్పింది. ఒక అర్ధగంట వరకు తానే డ్రైవ్ చేస్తానని, కొద్ది సేపు నిద్రపొమ్మని అతడికి సూచించింది. అయితే మెడనొప్పి ఉండటం వల్ల తాను ఎక్కువసేపు డ్రైవ్ చేయలేనని కూడా చెప్పింది. దీనికి డ్రైవర్ అంగీకరించాడు. గూగుల్‌ను ఫాలో అవుతూ డ్రైవింగ్, బురదలో కారు స్ట్రకింగ్

నేను డ్రైవ్ చేస్తూన్నే ఉన్నా, అయినా సరే ఆ డ్రైవర్ నిద్ర పోకుండా మళ్ళీ ఫోన్లో మాట్లాడటం మొదలు పెట్టాడు. నా డ్రైవింగ్ బాగుంది అంటూ మెచ్చుకోవడం చేశాడు. నేను బెదిరించే సరికి అప్పుడు నిద్రపోయాడైతే మళ్లీ లేవనే లేదు. ముంబై చేరుకొని మా ఇల్లు ఇంకా కొద్దిదూరంలో ఉందనగా  లేచాడు అని సోషల్ మీడియాలో ఆమె రాసుకొచ్చింది. డ్రైవర్ నిద్రపోయిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది.  భారతదేశంలో డ్రైవింగ్ అంటే నరకం అనిపించే నగరాలు ఏవో తెలుసా?  

దీనికి స్పందించిన క్యాబ్ సర్వీస్ యాజమాన్యం ఆ మహిళను క్షమాపణలు కోరి, క్యాబ్ డ్రైవర్ కు ఉన్న యాక్సెస్ ను తొలగించినట్లు పేర్కొంది.