Case Filed on Rooster: కోడి కూస్తోందని కేసు పెట్టారు.. ఇంతకీ ఆ కోడి ఏ రేంజు సౌండ్ తో కూస్తుందంటే?

ఊళ్లల్లో ఇరుగుపొరుగు మధ్య కోళ్ల పంచాయితీ కొత్తేం కాదు. కానీ, పక్కింటివాళ్ల కోడి కూత పెడుతూ వేధిస్తున్నదని పేర్కొంటూ కోర్టుకెక్కారు జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా.

Berlin, August 23: ఊరు అన్నాక కోడి, కోడి అన్నాక కూయడం అనేది సాధారణం. ఊళ్లల్లో ఇరుగుపొరుగు (Neighbours) మధ్య కోళ్ల పంచాయితీ కొత్తేం కాదు. కానీ, పక్కింటివాళ్ల కోడి (Rooster) కూత పెడుతూ వేధిస్తున్నదని పేర్కొంటూ కోర్టుకెక్కారు జర్మనీకి(Germany) చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటా.

జైల్లో ఉన్న బాయ్‌ఫ్రెండ్‌కు లిప్‌ కిస్ ఇచ్చి చంపేసింది, డ్రగ్స్ ఇద్దామని వేసిన ప్లాన్ బెడిసికొట్టింది, అమెరికా జైల్లో ఘటన, కటకటాల్లోకి ప్రియురాలు

కోడన్నాక కూయకుండా ఉండదని తమకు కూడా తెలుసు అని, అయితే, రోజుకు 200 సార్లు.. అదీ  80 డెసిబెల్స్‌ రేంజులో ఆ కోడి కూత పెడుతూ తమ చెవుల్ని బద్దలు కొడుతుందని వాళ్ళు వాపోయారు. త్వరలో ఈ కేసును కోర్టు (Court) విచారించనున్నది.



సంబంధిత వార్తలు