TikTok Viral Video: ఫాలోవర్ల కోసం చావు అంచుల్లోకి, మంచుతో గడ్డుకట్టుకుపోయిన సరస్సులో ఈత, బయటకి వచ్చే దారి తెలియక సతమతం, ఎలాగోలా బయటపడిన జాసన్ క్లార్క్
ముఖ్యంగా టిక్ టాక్ లో (TikTok) అయితే ఫాలోవర్ల కోసం డేంజరస్ స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు చాలామందే ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ఇప్పుడు ఈ స్టోరి కూడా అలాంటి ఓ వ్యక్తిదే... ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు.
New Delhi, Febuary 28: సోషల్ మీడియాలో (Social Media) పాపులర్ కావాలని చాలామంది నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా టిక్ టాక్ లో (TikTok) అయితే ఫాలోవర్ల కోసం డేంజరస్ స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు చాలామందే ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ఇప్పుడు ఈ స్టోరి కూడా అలాంటి ఓ వ్యక్తిదే... ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి శస్త్రచికిత్స చేసిన వీడియో టిక్ టాక్‌లో వైరల్
జాసన్ క్లార్క్ (Jason Clark) అనే టిక్ టాక్ స్టార్ తన 4లక్షల ఫాలోవర్ల కోసం ఓ అడ్వెంచరస్ స్టంట్ చేసి చావు అంచుల్లోకి వెళ్లి వచ్చాడు. మంచుతో గడ్డుకట్టుకుపోయిన సరస్సులో ఒక రంధ్రం నుంచి నీటిలోకి వెళ్లాడు. పైనంతా మంచుతో గడ్డుకట్టుకుపోగా కిందిభాగంలోని నీటిలో సరదాగా ఈత కొట్టాడు.
అయితే ఆ తర్వాత బయటకు వచ్చే దారి కానరాకపోవడంతో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఇంకో నిమిషం అలాగే ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. మంచులో రంధ్రం పడిన చోటు నుంచి నీళ్లలో ఈదిన అతడు తిరిగి అక్కడికి వచ్చేందుకు ప్రయత్నించిన తీరు చూస్తే వణుకుపుట్టించేలా ఉంది.
చివరిక్షణంలో ఎలాగో రంధ్రాన్ని గుర్తించి బయటకు వచ్చి గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేశాడు. నెటిజన్లు ఈ వీడియోపై అతనిని నానా రకాలుగా తిడుతున్నారు. అయితేనేమి మనోడికి ఈ వీడియో ఏకంగా 21 మిలియన్ల వ్యూస్ పైగానే తెచ్చిపెట్టింది.
Here's Video
ఈ సందర్భంగా జాసన్ తనకు ఎదురైన భయాంకరమైన అనుభవాన్ని ఫాలోవర్లతో పంచుకున్నాడు. ‘నేను చచ్చినంత పనైంది. బతకుతానని అనుకోలేదు. గడ్డుకట్టిన సరస్సులో నుంచి బయటకు రాలేక చాలా ఇబ్బంది పడ్డాను. అదృష్టవశాత్తూ రంధ్రం ఉన్న చోటు గుర్తించి బయటపడగలిగాను’ అంటూ తెలిపాడు.