
New Delhi, Febuary 22: మనుషులు క్రికెట్ (Cricket) ఆడటం చూశాం కాని జంతువులు క్రికెట్ ఆడటం ఎక్కడైనా చూశారా..అయితే ఈ వీడియో చూస్తే నిజమేనని ఒప్పుకుంటారు.ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతుంటే ఓ డాగ్ వికెట్ల వెనక నిలబడి కీపింగ్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి..టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్ (Simi Garewal) ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రకారం...ఇద్దరు చిన్నారులు క్రికెట్ ఆడుతున్నారు. వారితో కలిసి ఓ కుక్క కూడా కలిసి క్రికెట్ ఆడింది. ఇద్దరు పిల్లల్లో ఒకరు బౌలింగ్ చేస్తుంటే మరొకరు బ్యాటింగ్ చేస్తున్నారు. వీరికి తోడు ఓ కుక్క(Dog) చక్కగా వికెట్ కీపర్ గా పనిచేసింది. ఫీల్డింగ్ కూడా చేసేస్తోంది.
ఓ పిల్లాడు వేసిన బౌలింగ్ కు తన బ్యాట్ తో కొట్టిన బాల్ దూరంగా వెళ్లి పడింది. ఆ బాల్ ను వెతికి పిల్లాడికి ఇచ్చేసి తిరిగి వచ్చి మళ్లీ వికెట్ కీపర్ అవతారమెత్తింది. వికెట్ల వెనుక నిలబగి బంతి కదలికల్ని చురుగ్గా గమనిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Here's Video
An award for the Best Fielder of the Year!!👑🥜 pic.twitter.com/7PWBLBgnnV
— Simi Garewal (@Simi_Garewal) February 20, 2020
ఈ కుక్క భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పెంపుడు కుక్క అయి ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. కాగా కుక్కలకు మనుషులకు మధ్య స్నేహం ఈనాటిది కాదు. మనుషు భావాల్ని కుక్కలు చక్కగా అర్థం చేసుకుంటాయి. తమపై కొంచెం ప్రేమ చూపిస్తే చాలు తమ ప్రాణాల్ని కూడా అడ్డువేసి యజమానుల ప్రాణాల్ని కాపాడతాయి. అటువంటి కుక్క మనుషులకు చాలా చాలా విశ్వాసమైన జంతువుగా మారిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే.