Tamilnadu Hooch Tragedy: కల్తీమద్యం తాగి 12 మంది మృతి.. డజనుకు పైగా దవాఖానపాలు.. తమిళనాడులో ఘోరం
విల్లిపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో శనివారం రాత్రి కల్తీమద్యం తాగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల మధ్య వారు.
Chennai, May 15: తమిళనాడులో (Tamilnadu) ఘోరం జరిగింది. వీల్లుపురం జిల్లా ఎక్కియార్‌కుప్పం వద్ద మరక్కణంలో, అలాగే చెంగల్పట్టులో శనివారం రాత్రి కల్తీమద్యం (Spurious Liquor) తాగి 12 మంది (12 Members) ప్రాణాలు కోల్పోయారు. మృతులు 45 నుంచి 55 ఏళ్ల మధ్య వారు. శనివారం రాత్రి కల్తీమద్యంతో అస్వస్థులైన వీరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. వీరు కాక మరికొందరు మద్యం తాగడంతో అస్వస్థులు కాగా, డజను మందిని పొరుగునున్న పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
నలుగురు పోలీసుల సస్పెండ్
ఈ సంఘటనకు సంబంధించి నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం అమ్మిన నేరంపై ఒకరిని అరెస్టు చేశారు.