Son for Sale: ఉత్తరప్రదేశ్‌ లో దారుణం.. కొడుకును అమ్మకానికి పెట్టిన తండ్రి.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ఆ హృదయవిదారక ఘటన ఏంటంటే?

కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన కూర్చొన్న అతడు ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు. నేను అతడ్ని అమ్మాలనుకుంటున్నాను’ అని రాసి ఉన్న బోర్డును మెడలో వేసుకున్నాడు.

Boy for sale (Credits: X)

Newdelhi, Oct 29: ఉత్తర ప్రదేశ్ (UttarPradesh) కు ఒక వ్యక్తి తన కొడుకును అమ్మకానికి (Sale) పెట్టాడు. కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన కూర్చొన్న అతడు ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు. నేను అతడ్ని అమ్మాలనుకుంటున్నాను’ అని రాసి ఉన్న బోర్డును మెడలో వేసుకున్నాడు. (My son is for sale) అలీగఢ్‌ బస్టాండ్‌కు సమీపంలో ఒక వ్యక్తి తన భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి రోడ్డు పక్కన దీనంగా కూర్చొన్నాడు. అతడి మెడలో ఒక బోర్డు ఉంది. ‘నా కొడుకు అమ్మకానికి ఉన్నాడు. కుమారుడ్ని నేను అమ్మాలనుకుంటున్నాను’ అని రాసి ఉంది.

Rithu Chowdary Got Cheated: అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి

కారణం ఇదే

సదరు వ్యక్తి తన బంధువు నుంచి రూ.50,000 అప్పు చేశాడు. అది తీర్చకపోవడంతో బంధువుతో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన కూర్చొన్నాడు. తన కుమారుడ్ని బలవంతంగా అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అన్ని అప్పులు తీర్చేందుకు ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు కుమారుడ్ని అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ బంధువుతో మాట్లాడి ఆ వ్యక్తి సమస్యను పరిష్కరించారు. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు యూపీలో ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ సీఎం యోగి ప్రభుత్వంపై మండిపడ్డారు.

Model Body Found In Fridge: ఫ్రిడ్జ్‌లో దొరికిన మోడల్ శవం, రెండు నెలల ప్రెగ్నెంట్‌గా తేల్చిన పోలీసులు, కాళ్లు, చేతుల కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి దారుణంగా హత్య, పోస్టుమార్డంలో సంచలన నిజాలు