Uttar Pradesh Viral: పగబట్టిన నాగు.. 35 రోజుల్లో 6 సార్లు పాము కాటుకు గురైన వ్యక్తి.. వీకెండ్స్ లోనే పాము కాట్లు.. యూపీలో ఘటన.. అసలేంటి విషయం??
అది నిజమో కాదో తెలియదు కానీ.. యూపీలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక వ్యక్తి కేవలం 35 రోజుల వ్యవధిలో ఏకంగా ఆరు సార్లు పాముకాటుకు గురయ్యాడు.
Newdelhi, July 9: పాములు (Snakes) పగబడతాయని విన్నాం. అది నిజమో కాదో తెలియదు కానీ.. యూపీలో (Uttarpradesh) జరిగిన ఓ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక వ్యక్తి కేవలం 35 రోజుల వ్యవధిలో ఏకంగా ఆరు సార్లు పాముకాటుకు గురయ్యాడు. కాటుకు గురైన ప్రతిసారీ హాస్పిటల్ లో చేరి కోలుకొని ఇంటికి తిరిగి రావడం.. మళ్లీ పాముకాటుకు గురవ్వడం, తిరిగి మళ్లీ దవాఖానలో చేరడం ఇదే తంతు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా సౌరా గ్రామంలో వెలుగుచూసింది. 24 ఏళ్ల వికాస్ దూబే అనే యువకుడికి ఈ భయానక పరిస్థితి ఎదురైంది.
ఇల్లు మార్చేసినా..
పాముకాట్లు పెరుగుతుండటంతో వికాస్ దూబే భయంతో నివాసాన్ని మార్చుకున్నాడు. ఇంటిని వదిలి వేరే చోట ఉండాలంటూ పెద్దలు సలహా ఇవ్వడంతో మకాం మార్చాడు. అయినప్పటికీ, అతడు పాముకాటుకు గురవడంతో అందరూ నిర్ఘాంతపోతున్నారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థంకావట్లేదు. కాగా, పాముకాట్లు అన్ని శనివారం లేదా ఆదివారాల్లో జరిగాయని, ప్రతిసారీ కరవడానికి ముందస్తు తనకు సూచన అర్థమయ్యేదని వికాస్ దూబే వాపోయాడు.
ఒంటరి పెండ్లి.. సోలో హనీమూన్.. జపాన్ లో ఇప్పుడిదే ట్రెండింగ్.. అసలేంటి ఇది??