Uttar Pradesh: ట్విస్ట్ అంటే ఇదే మామా, పెళ్ళికి ముందు పెళ్లికూతురు తల్లిని లేపుకుపోయిన పెళ్ళి కొడుకు తండ్రి, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఆమె భర్త

తమ పిల్లల పెళ్లికి ముందు 10 మంది పిల్లల తండ్రితో కలిసి 6 మంది పిల్లల తల్లి పారిపోయింది. మహిళ యొక్క భర్త ఫిర్యాదు మేరకు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయిన మహిళ జంప్ అయిన వ్యక్తికి కాబోయే అత్త కావడం..

Love (Photo-Pixabay)

Kasganj, July 17: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. తమ పిల్లల పెళ్లికి ముందు 10 మంది పిల్లల తండ్రితో కలిసి 6 మంది పిల్లల తల్లి పారిపోయింది. మహిళ యొక్క భర్త ఫిర్యాదు మేరకు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. పారిపోయిన మహిళ జంప్ అయిన వ్యక్తికి కాబోయే అత్త కావడం..

ఘటన వివరాల్లోకెళితే.. యూపీలోని కాస్‌గంజ్‌లో కూలిపని చేసుకునే ఓ వ్యక్తి, ఈ-రిక్షా డ్రైవర్‌గా చేసే షకీల్‌ 28 ఏండ్లుగా స్నేహితులు. తన కుమారుడికి అతని కుమార్తెనిచ్చి చేద్దామని షకీల్‌ అడగడంతో ఆయన కూడా అంగీకరించాడు. జూన్‌ 17న వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో షకీల్‌, స్నేహితుని భార్య తరచూ మాట్లాడుకునే వారు.అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ బయట కలవడం, సాయంత్రం షికారుకు వెళ్ళడం లాంటి చేశారు.  ప్రేమ వివాహాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించకుండా అల్లుడిపై కేసు పెట్టడంపై మండిపాటు

ఇక పెళ్లి రోజు సమీపిస్తుందనగా ఇరు కుటుంబాలకు షాక్‌ ఇస్తూ జూన్‌ 3న పెళ్లి కొడుకు తండ్రి షకీల్‌, పెళ్లికుమార్తె తల్లి(35) లేచిపోయారు. 10 మంది సంతానం ఉన్న షకీల్‌, ఆరుగురు పిల్లలున్న పెండ్లి కుమార్తె తల్లి ఇలా చేయడం చూసి బంధువులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలుసుకున్నారు. కాగా, పెండ్లి కుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరూ ఈ ముదురు ప్రేమ జంట కోసం గాలిస్తున్నారు.