Viral Video: షాకింగ్ వీడియో.. వరదల్లో కొట్టుకుపోయిన ఏటీం, అందులో రూ. 24 లక్షల నగదు, ఉత్తరాఖండ్‌ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే అది కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో రూ. 24 లక్షలు జమ చేశారు. నదిలో అది కొట్టుకుపోయే సమయానికి ఖాతాదారులు ఎంత డ్రా చేశారన్న దానిపై వివరాలు తెలియరాలేదు.

ATM washed away in floods (Photo-ANI)

ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా ఓ ఏటీఎం నీటిలో కొట్టుకుపోయింది. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే అది కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో రూ. 24 లక్షలు జమ చేశారు. నదిలో అది కొట్టుకుపోయే సమయానికి ఖాతాదారులు ఎంత డ్రా చేశారన్న దానిపై వివరాలు తెలియరాలేదు. ఉత్తరాఖండ్‌లో ఈ వింత ఘటన జరిగింది. కాగా ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.

క్లాసు రూంలోనే ఆ పని కానిచ్చేశారు. కౌగింలింతల్లో మునిగితేలిన ఇంటర్ కాలేజీ విద్యార్థుల, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఏడుగురు విద్యార్థులు సస్పెండ్, అస్సాంలో ఘటన

దీంతో కుమోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. అంతకుముందే అందులో రూ. 24 లక్షలు నగదు ఉంచినట్టు చెప్పారు. ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

దీనిపై పంజాబ్ బ్యాంక్ అధికారులు ఇంకా స్పందించలేదు.