Man Serves Tea Mixed With His Spit: పవిత్రమైన నవరాత్రి రోజుల్లో ‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన యువకులు.. ఉత్తరాఖండ్ లో ఘటన (వీడియో)
టీ పాట్ లో ఉమ్మివేసి కస్టమర్లకు ఇద్దరు యువకులు ఆ చాయ్ ను సర్వ్ చేయడం కలకలం సృష్టించింది.
Newdelhi, Oct 11: ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని డెహ్రాడూన్ లో సమీపంలోని ముస్సోరిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. టీ (Tea) పాట్ లో ఉమ్మివేసి (Spit) కస్టమర్లకు ఇద్దరు యువకులు ఆ చాయ్ ను సర్వ్ చేయడం కలకలం సృష్టించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు యువకులు నౌషాద్ అలీ, హసన్ అలీ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం నిందితులిద్దరూ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
వీడియో ఇదిగో, వేధించాడని బస్సు ఆపి కండక్టర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిలు, మహారాష్ట్రలో ఘటన
Here's Video:
దొరికిన నిందితులు
నవరాత్రి రోజుల్లో వెలుగుచూసిన ఈ మొత్తం వ్యవహారంపై నగర వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలకు చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.