Bihar: పోలీస్ స్టేషన్లోనే మసాజ్ దుకాణం పెట్టిన పోలీస్ ఆఫీసర్, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో మసాజ్, మరో యువతితో రాసలీలలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బీహార్‌లో విధి నిర్వహణలో ఉండగానే మసాజ్ దుకాణం తెరిచిన ఓ పోలీస్ అధికారి వీడియో ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్‌ల్లో విపరీతంగా వైరల్ అయ్యింది.
బీహార్‌లో విధి నిర్వహణలో ఉండగానే మసాజ్ దుకాణం తెరిచిన ఓ పోలీస్ అధికారి వీడియో ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్‌ల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. బీహార్ సహస్రా జిల్లా నౌహట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాహర్ అవుట్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే సీనియర్ అధికారి శశిభూషణ్ సిన్హా.. మహిళ మసాజ్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను అవుట్‌పోస్ట్‌లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడాయన. ఆపై ఆమెతో బలవంతంగా మసాజ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
షర్ట్‌ను అక్కడే వేలాడదీసి.. ఆపై ఆమెతో ఒళ్లు బాగా పట్టించుకున్నాడు. ఆ టైంలో ఆయన సీరియస్‌గా ఫోన్ మాట్లాడుతుండగా.. ఎవరో ఆయన్ని వీడియో తీశారు. ఆ టైంలో అక్కడ మరో మహిళ కూడా ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. ఆయనపై వేటు పడింది.