Abids Fire Accident Viral Video: ప్రాణాలను గుప్పిటపెట్టుకొని.. తోసుకొంటూ బయటకు పరిగెత్తుతూ.. అబిడ్స్ లో బాణసంచా షాపులో అగ్నిప్రమాదం ముందు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. (వీడియోతో)

హైదరాబాద్ లోని అబిడ్స్‌ పరిధిలో బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Abids Fire Accident Viral Video (Credits: X)

Hyderabad, OCT 28: హైదరాబాద్ లోని అబిడ్స్‌ పరిధిలో (Abids Fire Accident) బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పారాస్‌ అనే బాణసంచా దుకాణంలో  (Paras Fireworks) జరిగిన పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌ కు కూడా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని కస్టమర్లు, స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే షాప్ లో నుంచి భయంతో కస్టమర్లు ఒకరినొకరు తోసుకుంటూ బయటకు వస్తున్న వీడియోలు ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసేలా ఉన్నాయి.

Here's Video:

పది బైక్స్ దగ్ధం

దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలోనే చోటుచేసుకున్న ఈ ఘటనలో పదికి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలు కాగా.. ఆమెను చికిత్స నిమిత్తం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif