Viral Video: రూ. 500 డ్రా చేస్తే రూ. 2500 ఇస్తున్న ఏటీఎం, కార్డులు పట్టుకుని పరుగులు తీసిన జనాలు, బిత్తరపోయిన బ్యాంక్ యాజమాన్యం

బుధవారం ఓ వ్యక్తి ఈ ఏటీఎంలోకి వెళ్లి రూ. 500 విత్ డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించడంతో రూ. 2500 (ఐదు రూ.500 నోట్లు) వచ్చాయి.

ATM Machine | Image Used for Representational Purpose Only | (Photo Credits: Money Control.com)

నాగపూర్ జిల్లా ఖాపరేఖేడ్ పట్టణంలోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో వింత ఘటన జరిగింది. బుధవారం ఓ వ్యక్తి ఈ ఏటీఎంలోకి వెళ్లి రూ. 500 విత్ డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించడంతో రూ. 2500 (ఐదు రూ.500 నోట్లు) వచ్చాయి. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన వ్యక్తి అదే తరహాలో మరో రూ. 500 విత్ డ్రా చేయగా మళ్లీ రూ. 2500 వచ్చాయి. ఈ విషయాన్ని నగదు విత్ డ్రా చేసుకొనేందుకు వచ్చిన మరో వ్యక్తి గమనించి పక్కనే ఉన్న వ్యక్తికి చెప్పడంతో ఆ వార్త స్థానికంగా దావానంలా వ్యాపించింది.

ఇకేముంది.. జేబులో ఏటీఎం కార్డు ఉన్న ప్రతిఒక్కరూ అక్కడికి వాలిపోయి.. ఏటీఎంలో నగదు తీసుకొనేందుకు పోటీపడ్డారు. ఈ విషయాన్ని స్థానికుల్లో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలికి వచ్చి చూసేసరికి జనం గుమ్మిగూడి ఉండటంతో వారిని అక్కడి నుంచి పంపించివేసి ఏటీఎం సెటర్ క్లోజ్ చేశారు. మద్యం ప్రియులు గుండెలు బాదుకునే న్యూస్, రూ. 92 లక్షల విలువ గల 8800 బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేసిన పోలీసులు, అన్నమయ్య జిల్లాలో ఘటన

ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేయడంతో.. హుటాహుటీన అక్కడికి చేరుకున్న బ్యాంక్ సిబ్బంది.. ఇలా ఎలా జరిగిందా అని తనిఖీ చేశారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. రూ.100 విలువైన నోట్లను ఉంచాల్సిన ట్రేలో రూ.500 నోట్లు తప్పుగా ఉంచడంతో ఇలా జరిగిందని గుర్తించారు.

ఇక ఏటీఎంలో ఎంత సొమ్ము ఉంచాం.. ఇప్పుడు ఎంత ఉంది.. ఎంత నగదు ఎక్కువగా విత్ డ్రా అయ్యింది అనే విషయాలపై ఆరాతీసే పనిలో పడ్డారు. మరోవైపు పోలీసులు ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసే పనిలో పడ్డారు. ఎవరు ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేశారో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.