Train Accident in Bengal: బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొన్న కాంచన్ జంగ ఎక్స్ ప్రెస్.. గాల్లోకి లేచిన బోగీ.. పలువురి మృతి!
సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కాంచన జంగ్ ఎక్స్ ప్రెస్ ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Kolkata, June 17: బెంగాల్ (Bengal) లో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. సీల్దా నుంచి వెళ్తున్న కాంచన్ జంగ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కాంచన జంగ ఎక్స్ ప్రెస్ (Kanchanjungha Express) ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో కాంచనజంగ ఎక్స్ ప్రెస్ కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిగ్నలింగ్ లోపమా??
రైలు ప్రమాద ఘటన ఎలా జరిగిందనేది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. అయితే సిగ్నలింగ్ సమస్యతో రెండు రైళ్లు ఒకే ట్రాక్ లో కదిలినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ కోణంలోనే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.