Who Is Bhole Baba: హత్రాస్‌ తొక్కిసలాటకు కారణమిదేనా ? ఇంతకీ లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఈ బోలే బాబా ఎవరు, హత్రాస్ విషాదకర ఘటనపై పూర్తి కథనం..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదంగా మారిన సంగతి విదితమే.హత్రాస్‌లోని (Hathras) సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది.

Who Is Bhole Baba aka Narayan Sakar Hari

Who Is Bhole Baba aka Narayan Sakar Hari: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదంగా మారిన సంగతి విదితమే.హత్రాస్‌లోని (Hathras) సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది. భోలో బాబాగా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృతి చెందారు.

వీరిలో మహిళలు , పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో సత్సంగం ఏర్పాటు చేయగా, సత్సంగం ముగుస్తుందనగా ఒకేసారి అందరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, సభా స్థలి చిన్నది కావడంతో పలువురికి ఊపిరి ఆడలేదని, కొందరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. హత్రాస్‌ తొక్కిసలాట, 116కి పెరిగిన మృతుల సంఖ్య, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన యోగీ సర్కారు

యూపీకి చెందిన నారాయణ్‌ సాకార్‌ హరి.. సాకార్‌ విశ్వ హరి లేదా ‘భోలే బాబా’గా (Bhole Baba aka Narayan Sakar Hari)ప్రసిద్ధి చెందారు. ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్‌ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడని తెలుస్తోంది. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా పనిచేసినట్టు చెబుతారు. 26 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మతపరమైన సత్యంగాలు ప్రారంభించారు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.

ఆయనకు వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. మోడ్రన్ బాబాల మాదిరిగా కాకుండా బోలో బాబా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు.ఆయన కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. బోలో బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రతి మంగళవారం నిర్వహిస్తుంటారు. దీనికి వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు అవసరమైన ఆహార, నీటి వసతులను వలంటీర్లే స్వయంగా ఏర్పాటు చేస్తుంటారు. హత్రాస్ ఘటనలో 87కి పెరిగిన మృతుల సంఖ్య, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన యోగీ సర్కారు

తాజాగా అక్కడి ఫుల్‌రాయ్‌ గ్రామంలో శివారాదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు సుమారు 20వేల మంది భక్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు.గాయపడిన క్షతగ్రాతులకు సకాలంలో చికిత్సనందించేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆధిత్యనాద్‌ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఆధిత్యనాద్‌ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.

కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి కారు బయలుదేరే వరకు భక్తులను వెళ్లనీయకుండా నిర్వహకులు అడ్డుకున్నారు. దీంతో నిర్వహకులు భక్తుల్ని అడ్డుకోవడం..వెనుక నుంచి ముందుకు భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుందని మరికొన్ని వార్తలు వస్తున్నాయి.