Hathras Stampede (Photo-ANI)

Lucknow, July 2: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చిన్నారులు సహా 87కి పైగా మృతి చెందారు. మరో 18కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హత్రాస్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం తొక్కిసలాట జరిగింది. రతిభాన్‌పూర్‌లో శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే భక్తులు ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  హత్రాస్‌‌లో మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట, 27 మంది మృతి, వందమందికి పైగా గాయాలు, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువస్తున్నారని.. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని ఇటా చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ ఉమేశ్‌ త్రిపాఠి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్నిప్రకటించింది.

హత్రాస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హత్రాప్‌ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Here's News

హత్రాస్ తొక్కిసలాట (Hathras Stampede) లో పెద్ద సంఖ్యలో భక్తులు మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టుపెట్టారు.