Parle-G Biscuits: పార్లే-జి బిస్కెట్‌ ప్యాక్‌ పై ఉండే చిన్నారి ఎవరు? సీక్రెట్ రివీల్ చేసిన కంపెనీ మేనేజర్‌

దేశంలో పార్లేజీ బిస్కెట్లు రుచి చూడని వారు ఉండరు. ప్రస్తుతం మార్కెట్‌ లో వివిధ రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది పార్లే-జి బిస్కెట్లను తినేందుకు ఇష్టపడుతున్నారు. 12 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ బిస్కెట్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్‌గా నిలిచింది.

Parle-G (Credits: Twitter)

Hyderabad, Aug 4: బిస్కెట్లు (Biscuits) అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పార్లే- జీ (Parle-G Biscuits). దేశంలో పార్లేజీ బిస్కెట్లు రుచి చూడని వారు ఉండరు. ప్రస్తుతం మార్కెట్‌ లో వివిధ రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది పార్లే-జి బిస్కెట్లను తినేందుకు ఇష్టపడుతున్నారు. 12 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ బిస్కెట్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్‌గా నిలిచింది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం 8000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తుంది. ఇది ఒక రికార్డుగా (Record) చెప్పుకోవచ్చు. ఈ బిస్కెట్ ప్యాక్‌లో ఒక చిన్న అమ్మాయి అందమైన చిత్రం కనిపిస్తుంటుంది. ఈ అమ్మాయి ఎవరో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు.

Onion Price: టమాటా తర్వాత ఇక ఉల్లివంతు.. వచ్చే నెలలో రూ. 70కి చేరుకోనున్న ధర.. ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ నివేదిక.. సరఫరా-డిమాండ్ మధ్య తేడానే కారణం

Viral Video: ఈ స్నేహం ఎంతో మధురం.. పాము, ఆవు మధ్య మైత్రి.. వీడియో సూపర్

చిన్నారి బొమ్మ ఎవరిది?

పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్‌ పై ఉన్న చిన్నారి బొమ్మ ఎవరిది అన్నది దశాబ్దాలుగా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇది ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి చిన్ననాటి ఫోటో అని చాలామంది భావించారు. కొందరు అది నీరూ దేశ్‌పాండే అని, మరికొందరు చిత్రంలో ఉన్న అమ్మాయి గుంజన్ దుండానియా అని ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ మిస్టరీ అమ్మాయి సీక్రెట్ రివీల్ అయింది. పార్లే-జి బిస్కెట్ బాక్స్‌ పై ఉన్న అమ్మాయి ఫోటో ఎవరిది కాదని పార్లే జి గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా తెలిపారు. ఇది కల్పిత చిత్రం మాత్రమేనని, ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ మగన్ లాల్ దహియా 1960లో రూపొందించారని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ అరెస్ట్

Pakistani National Arrested in Bengaluru: బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీ అరెస్ట్, మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bengaluru Murder: శ్రద్ధా వాకర్ హత్యలా బెంగుళూరులో మరో హత్య, యువతి మృతదేహాన్ని 50 ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచాడు

Flipkart Big Billion Days Sale 2024 Deals: ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ లో మ‌రిన్ని డీల్స్ విడుద‌ల‌, ఈ ఫోన్ల‌పై ఏకంగా ప‌దివేల వ‌ర‌కు త‌గ్గింపు, ఏయే డీల్స్ ఉన్నాయంటే?