Hyderabad, Aug 5: పెరిగిన టమాటా (Tomato), ఇతర కూరగాయల ధరలతో (Vegetables Price) భయపడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలేలా ఉంది. ఈ నెలాఖరుకు ఉల్లి ధర (Onion Price) కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ (Crisil) పేర్కొంది. సరఫరా-డిమాండ్ మధ్య అసమతౌల్యం ఉందని, ఇది ఆగస్టు నాటికి కనిపించవచ్చని తెలిపింది. రబీ ఉల్లి నిల్వ కాలం 1-2 నెలలు తగ్గినట్టు పేర్కొంది. ఈ నెలాఖరుకు ఇవి మరింత తగ్గుముఖం పడతాయని, ఫలితంగా సెప్టెంబరు నాటికి ధరలు పెరగొచ్చని అంచనా వేసింది. అయితే, ఖరీఫ్‌లో దిగుబడులు పెరిగితే ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని నివేదికలో పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబరు వర్షపాతంపై ఉల్లి ధరలు ఆధారపడి ఉంటాయని క్రిసిల్ వివరించింది.
Viral Video: ఈ స్నేహం ఎంతో మధురం.. పాము, ఆవు మధ్య మైత్రి.. వీడియో సూపర్
Onion prices are likely to start shooting up in the retail market towards the end of August before going up further to around rupees 60-70 per kg next month due to tightened supplies, a report said on August 4.https://t.co/lPx1gSm6B1
— The Hindu (@the_hindu) August 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)