Hyderabad, Aug 5: స్నేహానికి (Friendship) ఎల్లలు లేవంటారు. అటవీశాఖ అధికారి సుశాంత నంద (Forest Officer Sushanth Nanda) తాజాగా షేర్ చేసిన వీడియో అలాంటిదే. ఈ వీడియోలో (Video) ఆవు (Cow), పాము (Snake) స్నేహంగా మసలుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో పాము, ఆవు పక్కపక్కనే ఉన్నాయి. వాటి మధ్య ఎటువంటి వైరభావం కనిపించలేదు సరికదా రెండూ పరస్పర నమ్మకంతో స్నేహంగా ఉన్నట్టు కనిపించాయి. ఈ అసాధారణ బంధం వెనుక కారణాలను వివరించడం కష్టమని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్వీట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రకృతి సంక్లిష్టమైందని, స్వానుభవంతోనే అది అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఆ రెండూ తమదైన భాషలో మాట్లాడుకుంటున్నాయని, ఇది మనుషులకు అందనిదని మరికొందరు వ్యాఖ్యానించారు.

EG.51 New Variant: ఇదేం కర్మరా స్వామీ.. పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కొత్త రూపంలో.. బ్రిటన్‌ లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’.. కొత్త కేసుల్లో 14.6 శాతం అవే.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)