EG.51 New Variant: ఇదేం కర్మరా స్వామీ.. పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కొత్త రూపంలో.. బ్రిటన్ లో వేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ.5.1’.. కొత్త కేసుల్లో 14.6 శాతం అవే.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా పీడ వీడట్లేదు. ఈ వైరస్ లో కొత్తరకం వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ ను వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ5.1’ (ఎరిస్) అనే ఈ కొత్త రకం వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ అక్కడి ప్రజలను భయపెడుతోంది.
London, Aug 5: కరోనా (Corona) పీడ వీడట్లేదు. ఈ వైరస్ (Virus) లో కొత్తరకం వేరియంట్ (New Variant) ఇప్పుడు బ్రిటన్ (Britain)ను వణికిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) నుంచి పుట్టుకొచ్చిన ‘ఈజీ5.1’ (ఎరిస్) అనే ఈ కొత్త రకం (EG.51 New Variant) వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ అక్కడి ప్రజలను భయపెడుతోంది. అక్కడ కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో దీనివాటా 14.6 శాతంగా ఉన్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. బ్రిటన్ లోనే కాదు అంతర్జాతీయంగానూ ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతున్నారు.
New COVID variant spreading across UK - as cases continue to rise https://t.co/zir2YH5JcU
— Sky News (@SkyNews) August 4, 2023
ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే?
కరోనా టీకాలు తీసుకున్నా, ఒకసారి కరోనా బారినపడి కోలుకున్నా కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే, ఈ వేరియంట్ తో తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందన్న సూచనలు కనిపించలేదని పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Aug 05, 2023 08:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

