Crisil Report: మాంసాహార భోజనం ధర తగ్గితే, శాకాహార భోజనం ధరలు పెరిగాయి.. క్రిసిల్ తాజా నివేదిక
ఇదే సమయంలో మాంసాహార భోజనం ధర తగ్గినట్టు వివరించింది.
Newdelhi, July 6: శాకాహార భోజనం (Veg Thali) సగటు ధర జూన్ లో 10 శాతం పెరిగినట్లు క్రిసిల్ నివేదిక (Crisil Report) వెల్లడించింది. ఇదే సమయంలో మాంసాహార భోజనం (Non Veg Meals) ధర తగ్గినట్టు వివరించింది. చికెన్ ధర తగ్గడం మాంసాహార భోజనం ధర తగ్గడానికి దోహదపడిందని తెలిపింది. వెజ్ థాలీ ప్లేట్ సగటు ధర 2023 జూన్ లో రూ. 26.70 కాగా, ఈ ఏడాది జూన్ లో రూ. 29.40కు పెరిగింది. 2024 మేలో ఇది రూ. 27.80గా ఉంది. ఉల్లి, టమాటా, బంగాళదుంపలు, బియ్యం, పప్పుల ధరలు పెరగడమే శాఖాహారం థాలీ ధరలు పెరగడానికి కారణంగా నివేదిక పేర్కొంది.
నాన్ వెజ్ ఇలా..
చికెన్ రేటు 14 శాతం తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్ లో రూ. 58కి దిగివచ్చింది. గతేడాది జూన్ లో ఇది రూ. 60.50గా ఉంది.