Newdelhi, July 6: వంటింట్లో వాడే స్టెయిన్ లెస్ స్టీల్ (Stainless Steel), అల్యూమినియం (Aluminium) వంట పాత్రలకు కేంద్ర ప్రభుత్వం ఐఎస్‌ఐ గుర్తును తప్పనిసరి చేసింది. వినియోగదారుల భద్రత, ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించే చర్యల్లో భాగంగా జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఐఎస్‌ఐ మార్క్ లేని స్టీల్, అల్యూమినియం వంట పాత్రల తయారీ, ఎగుమతి, అమ్మకాలపై నిషేధం ఉందని భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్) తెలిపింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన వారిపై జరిమానాలు విధిస్తామని చెప్పింది.
ISI Mark Compulsory for Stainless Steel and Aluminium Utensils: Conformity to Bureau of Indian Standards (BIS) Mandatory for Kitchen Utensils
https://t.co/BAX8fqXAKb #ISIMark #StainlessSteel #KitchenUtensils #BIS #BISCertification
— LatestLY (@latestly) July 5, 2024
ప్రమాణాలు ఇవే
వంట పాత్రల తయారీకి సంబంధించి బీఐఎస్ తాజాగా కొన్ని ప్రమాణాలు రూపొందించింది. పాత్రల తయారీలో నాణ్యమైన, సురక్షితమైన ముడి సరుకు వాడటం, రూల్స్ ప్రకారమే పాత్రల రూపు, డిజైన్, బరువు ఉండటం వంటి అంశాలపై ఈ ప్రమాణాలను నిర్దేశించింది.
తమిళనాడులో దారుణం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన ప్రత్యర్థులు