Tata Nexon Hits Bull Video: 70 కిలోమీటర్ల వేగంతో ఎద్దును ఢీకొట్టిన టాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు, ఆ తరువాత ఏమైందో వీడియోలో చూడండి

టాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. రాత్రి సమయం కావడంతో వీధి లైట్ల వెలుగులు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఓ ఎద్దు కారుకు అడ్డుగా వచ్చింది. దాంతో ఆ ఎద్దుని నెక్సాన్ గట్టిగా ఢీకొంది. ఈ దెబ్బకు బిత్తరపోయిన నెక్సాన్ డ్రైవర్ కారును పక్కకు ఆపాడు.

Tata Nexon hits bull at 70 km/h (Photo/Video Grab/Nikhil Rana)

టాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. రాత్రి సమయం కావడంతో వీధి లైట్ల వెలుగులు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఓ ఎద్దు కారుకు అడ్డుగా వచ్చింది. దాంతో ఆ ఎద్దుని నెక్సాన్ గట్టిగా ఢీకొంది. ఈ దెబ్బకు బిత్తరపోయిన నెక్సాన్ డ్రైవర్ కారును పక్కకు ఆపాడు. కారు అంత వేగంగా, బలంగా ఢీకొన్నా, ఎద్దు మాత్రం గెంతుతూ అక్కడి నుంచి పరుగున వెళ్లిపోయింది. డ్రైవర్ కారు దిగి చూసుకోగా.. ముందు బ్యానెట్ భాగంలో డ్యామేజ్ అయింది. నిఖిల్ రాణా అనే యూట్యూబర్ ఈ వీడియోను షేర్ చేశారు. టాటా నెక్సాన్ కారులోని డ్యాష్ బోర్డ్ కెమెరా దీన్ని రికార్డు చేసింది. కారులోని వారికి ఏమీ కాలేదు. మన దేశంలోనే సురక్షితమైన కార్లలో ఈ టాటా నెక్సాన్ ఎస్ యూవీ కారు ఒకటి. అంతేకాదు గ్లోబల్ క్రాష్ టెస్ట్ లో భారత్ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన ఏకైక కారు ఇది. అంటే ప్రమాదం జరిగినప్పుడు అందులోని వారికి రక్షణ ఎక్కువగా ఉంటుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement