Adipurush; ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు.. జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు

తెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఆదిపురుష్’పై వస్తున్న కొత్త అప్డేట్స్ పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

Prabhas Adipurush (PIC @ T series Twitter)

Hyderabad, June 12: తెలుగు ప్రేక్షకులే కాదు యావత్తు పాన్ ఇండియా (Pan India) అభిమానులు (Fans) ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ సెన్సేషన్ మూవీ ‘ఆదిపురుష్’పై (Adipurush) వస్తున్న కొత్త అప్డేట్స్ పై ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16న విడుదల కానుంది. చారిత్రక రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అయితే, రామాయణ పారాయణ జరిగే ప్రతిచోట హనుమంతుడు ఉంటాడన్న నమ్మకంతో ఆదిపురుష్ ప్రదర్వించే ప్రతి థియేటర్‌లో ఓ సీటును ఖాళీగా ఉంచేందుకు చిత్ర బృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా ఇదే కోవలో మరో నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్లు ఇవ్వనున్నట్టు ఆదివారం ప్రకటించింది. తమ సొంత డబ్బులతో ఈ టిక్కెట్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ మీడియాతో పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)